![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -984 లో.. ఆ రిషి ఫెస్ట్ కి వస్తున్నాడు మమ్మీ. నువ్వు కూడా ఇక్కడికి రా.. టెన్షన్ గా ఉందని దేవయానిని శైలేంద్ర రమ్మని చెప్తుండగా.. అప్పుడే మహేంద్ర వచ్చి ఫోన్ లాక్కొని రండి వదిన గారు.. రిషి వస్తున్నాడంటు వెటకారంగా మాట్లాడతాడు. రిషి వస్తున్నాడు ఈ రోజు శైలెంద్ర చేసిన కుట్రలు, మోసాలు బయటపడుతాయి. వాడిని పోలీసులు తీసుకొని వెళ్తుంటే మీరు చూడాలని మహేంద్ర అంటాడు. దేవయానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు.
ఆ తర్వాత ఈ రోజు నీ ముసుగు తొలగిపోతుంది. నీ నిజస్వరూపం బయటపడుతుంది. ఎంత నటిస్తావ్ రా.. ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా నీలో.. మీ నాన్న ముందు అమాయకుడిలా.. రిషి ముందు మంచోడిలా.. మా ముందు క్రూరుడిలాగా ఉన్నావ్. ఇక నీ ఆటలు సాగవని శైలేంద్రకి మహేంద్ర వార్నింగ్ ఇస్తాడు. కాలేజీలో జరిగే ఫెస్ట్ కి అతిధిగా మినిస్టర్ వస్తాడు. అతనికి వసుధార, మహేంద్ర, ఫణింద్ర కలిసి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్తారు. ఆ తర్వాత రిషి వస్తున్నాడట కదా అని వసుధారని మినిస్టర్ అడుగుతాడు. అవునని వసుధార చెప్పగానే చాలా సంతోషంగా ఉంది.. రిషి లాంటి గొప్ప మనిషి వస్తేనే ఈ ఫెస్ట్ కి కంప్లీట్ నెస్ వస్తుందని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత చక్రపాణికి వసుధార ఫోన్ చేసి.. రిషి సర్ ఏం చేస్తున్నారు.. వస్తున్నారా అని అడుగుతుంది. వస్తున్నాం కానీ ఇప్పుడు రిషి సర్ అక్కడికి ఎందుకని చక్రపాణి అడుగుతాడు. ఇప్పుడు రావాలి తన సామ్రాజ్యంలో అడుగుపెట్టాలి. తన స్టూడెంట్స్తో మాట్లాడాలని వసుధార చెప్తు.. మీరు రిషి సర్ ని తీసుకొని రండి అని చెప్తుంది.
ఆ తర్వాత రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేసి.. రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నావా అని అడుగుతాడు. మీరు టెన్షన్ పడకండి. నేను తెలుసుకుంటానని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత కాలేజీలో మినిస్టర్ గారికి సన్మానం చేస్తారు. అతను రిషి, వసుధారల గురించి గొప్పగా మాట్లాడుతాడు. రిషి ఎక్కడ వరకు వచ్చాడని వసుధారని మహేంద్ర అడుగుతుంటే అది శైలేంద్ర విని భద్రకి ఫోన్ చేసి.. రిషి వాళ్ళు ఎక్కడైన కన్పించారా అని అడుగుతాడు. లేదు వెయిట్ చేస్తున్నానని భద్ర అంటాడు. ఆ తర్వాత ఇక అన్ని నిజాలు తెలిస్తే శైలేంద్ర పరిస్థితేంటని దేవయాని భయపడుతుంది. అప్పుడే దేవయాని దగ్గరికి ధరణి వచ్చి.. రిషి వస్తే అన్ని నిజలు తెలిస్తే మీ పరిస్థితేంటని ఆలోచిస్తున్నార అని అడుగుతుంది. వాడికి అసలు ఆ రిషి వస్తున్నాడని ఫ్లెక్సీ వేయించమని ఐడియా ఇచ్చింది ఎవరోనని దేవయాని అనగానే.. నేనే ఇచ్చానంటు ధరణి అంటుంది. ఆ తర్వాత ధరణి హ్యాపీగా.. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటు పాట పాడుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |